మహిళా వర్సిటీలో అత్యాధునిక అంతరిక్ష పరిశీలన కేంద్రం ఏర్పాటు
రిపోర్టర్: మహేష్
స్థలం: తిరుపతి
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో అత్యాధునిక పరికరాలతో 'శ్రీ పద్మావతి స్పేస్ అబ్జర్వేషన్ సెంటర్' ఏర్పాటవుతోంది. ఈ నెల చివరి నాటికి ఇది అందుబాటులోకి రానుంది. అంతరిక్ష విజ్ఞానం, ఖగోళ శాస్త్రంపై విద్యార్థినులకు ఆచరణాత్మక పరిశోధనలు, ప్రత్యక్ష శిక్షణ అందించేందుకు ఈ కేంద్రం దోహదపడుతుంది. తక్కువ కక్ష్యలోని ఉపగ్రహాలు, అంతరిక్ష శిథిలాలను పరిశీలించేందుకు అత్యాధునిక టెలిస్కోపులను ఏర్పాటు చేస్తున్నారు.