సైబర్ మోసాలపై అవగాహన కల్పించేలా జగిత్యాలలో ప్రత్యేక వాక్
రిపోర్టర్: సునీల్
స్థలం: జగిత్యాల
సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించి అప్రమత్తం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు SP JAGTIAL వెల్లడించారు. సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ఒక అడుగు ముందుకు వేసి సమాజంలో అవగాహన వెలుగులు నింపాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నైట్ వాక్‌తో కార్యక్రమాన్ని ప్రారంభించి, ఫ్లాష్ వాక్‌తో ముగిస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ భద్రతను ప్రతి ఒక్కరూ పాటించాలని, అనుమానాస్పద కాల్స్ లేదా మోసాలు జరిగితే వెంటనే 1930 నంబర్‌కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.