మెహదీపట్నం స్కైవాక్ ప్రారంభానికి సిద్ధం: పాదచారులకు ట్రాఫిక్ కష్టాల నుంచి భారీ ఊరట

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ లోని మెహదీపట్నంలో హెచ్ఎమ్డీఏ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 360 మీటర్ల స్కైవాక్ పనులు పూర్తయ్యాయని, మరో పదిహేను రోజుల్ లో ప్రజల వినియోగానికి అందుబాటులోకి రానుందని అధికారులు వెల్లడించారు. నగరంలోనే తొలిసారిగా పిల్లర్లతో సహా పూర్తి నిర్మాణాన్ని స్టీల్ తో చేపట్టామని, వంద సంవత్సరాల మన్నిక ఉండేలా దీనిని అత్యంత పటిష్టంగా తీర్చిదిద్దామని వారు తెలిపారు. నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ చిక్కులు పూర్తిగా తొలగిపోనున్నాయి.