పురుషోత్తపురంలో వినాయక మండపం వద్ద భారీ అన్నదానం
రిపోర్టర్: NANUPATRUNI RANJITH KUMAR
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామంలోని యువత ఆధ్వర్యంలో మహాగణపతి వేడుకల సందర్భంగా ఏడవ రోజున భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పురుషోత్తపురం గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహాప్రసాదం స్వీకరించారు. యువకుల చొరవతో చేపట్టిన ఈ అన్నదాన సంతర్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగింది.