స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి: తోట దొరబాబు
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: కొయ్యూరు
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బుదరాళ్ల పంచాయతీ పోకలపాలెం గ్రామంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీ అభ్యర్థులను ఘనంగా గెలిపించాలని టీడీపీ కొయ్యూరు మండల ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు పిలుపునిచ్చారు. ఎంపీటీసీ స్థానానికి పోటీ చేయాలని ఆశపడే ఆశావహులు తమ పూర్తి వివరాలను పాడేరు టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి దృష్టికి వెంటనే తీసుకువెళ్లాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.