'స్వచ్ఛతా హీ సేవ'తో నూతన ఉద్యమం: ప్రధాని మోదీ జన్మదినం
రిపోర్టర్: సునీల్
స్థలం: భారతదేశం
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినమైన సెప్టెంబర్ 17 నుంచి దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమం నూతన దశను సంతరించుకోనుంది. పారిశుద్ధ్యాన్ని జనచైతన్య ఉద్యమంగా మార్చే లక్ష్యంతో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో విస్తృత శుభ్రతా పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా విద్యాసంస్థల్లో ‘స్వచ్ఛ పాఠశాల’, సెప్టెంబర్ 27న పర్యాటక ప్రాంతాల శుభ్రత, అక్టోబర్ 1న ‘ఒక రోజు – ఒక గంట’ శ్రమదానం మరియు అక్టోబర్ 2న ‘స్వచ్ఛ భారత్ దివస్’ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.