లింగంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులపై ప్రయాణికుల తీవ్ర అసంతృప్తి

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలోని కీలకమైన లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు అమృత్ భారత్ పథకంలో చోటు దక్కకపోవడంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నగర విస్తరణకు తగినట్లుగా మౌలిక వసతులు కల్పించడంలో రైల్వే శాఖ విఫలమైందని, ఆర్‌ఓబీ నిర్మాణాలు, రైళ్ల పొడిగింపు ప్రతిపాదనలు ఇంకా కార్యరూపం దాల్చలేదని స్థానికులు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేసిన విజ్ఞప్తులు పెండింగ్‌లోనే ఉన్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.