మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు స్వాగతం సిగ్గుచేటు: సీపీఐ నారాయణ మండిపాటు

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని కూటమి నేతలు స్వాగతించడం సిగ్గుచేటని సీపీఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ మండిపడ్డారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం వల్లే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పిన తర్వాతే ఎన్నికలను ముందుకు తీసుకెళ్లాలని కె.నారాయణ డిమాండ్ చేశారు.