నగరి మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని పార్టీ శ్రేణుల పిలుపు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నగరి

చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఒకటో వార్డు నుండి పర్వీన్ అలాగే ఏడో వార్డు నుండి వి అశోక్ కుమార్ కమ్యూనిస్ట్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. మౌలిక వసతుల కల్పన కోసమే వారు బరిలో నిలిచారు. ప్రజలు డబ్బులకు అమ్ముడుపోకుండా సమస్యలను కౌన్సిల్లో గట్టిగా నిలదీసే సిపిఐ అభ్యర్థులను అత్యధిక ఓట్లతో గెలిపించాలని పార్టీ నాయకులు కోరారు.