కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతోందని టీడీపీ వెల్లడి

రిపోర్టర్: గోపి స్థలం: Andhra Pradesh

గత ప్రభుత్వ పాలనతో పోలిస్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు నూరు రెట్లు మెరుగ్గా ఉన్నాయని తెలుగు దేశం పార్టీ (టీడీపీ) వెల్లడించింది. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మంచి జరుగుతోందని, ముఖ్యంగా మహిళలకు ఆర్థికంగా గణనీయమైన లబ్ధి చేకూరుతోందని స్పష్టం చేసింది. రోడ్లు, రవాణా, సాగునీటి ప్రాజెక్టులు, ఎయిర్ పోర్టులు, పరిశ్రమల రంగాల్లో అభివృద్ధి, మార్పు స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంటూ మళ్లీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.