ఇందిరమ్మ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి: నగరిలో సీపీఐ డిమాండ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నగరి

చిత్తూరు జిల్లా నగరి పరిధిలోని టి.ఆర్.కండ్రిగ ఇందిరమ్మ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వీధిదీపాలు వెంటనే ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.నాగరాజు డిమాండ్ చేశారు. స్థానికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వర్షాల వల్ల గుంతలు పడి రోడ్లు ప్రమాదకరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. మురుగునీరు రోడ్లపై చేరి దుర్వాసనతో దోమలు ప్రబలుతున్నాయని, మున్సిపల్ అధికారులు తక్షణమే సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.