జువైనల్ జస్టిస్ చట్టంపై తెలంగాణ హైకోర్టు కీలక సదస్సు
రిపోర్టర్: గోపి
స్థలం: Hyderabad, Telangana
తెలంగాణ హైకోర్టు జువైనల్ జస్టిస్ కమిటీ ఆధ్వర్యంలో బాలల సంరక్షణ చట్టం-2015 అమలుపై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. గత పదేళ్ల అమలు తీరు, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు. బాలల హక్కులు, రక్షణ పటిష్టం చేయడంపై న్యాయమూర్తులు, పోలీసు అధికారులు కీలక సూచనలు చేశారు. 2026 నాటికి అమలు చేయాల్సిన మార్పులపై భాగస్వామ్యులతో సమగ్ర సంప్రదింపులు జరిపారు.