రాజకీయాల్లో హుందాతనానికి ప్రతీక మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఏలూరు

మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని రాజకీయాల్లో హుందాతనానికి ప్రతీక అని మంత్రి నారా లోకేశ్‌ కొనియాడారు. ఏలూరు శ్రీరామ్‌నగర్‌ నివాసంలో ఉంచిన నాని పార్థివదేహానికి గురువారం లోకేశ్‌ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. చిన్న వయసులోనే ఆయన మృతి చెందటం బాధాకరమని, రాష్ట్రం ఒక మంచి నేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్‌ సమయంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.