చెక్కుల దుర్వినియోగంపై చెన్నై పోలీసులను ఆశ్రయించిన నటి రాధ

రిపోర్టర్: రాము స్థలం: చెన్నై

అలనాటి నటి రాధ, అంబికల మధ్య ఆస్తి మరియు ఆర్థిక లావాదేవీల వివాదం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యవరకు చేరింది. తన సంతకంతో ఉన్న పాత చెక్కులను దుర్వినియోగం చేసి రూ. 46 కోట్ల భారీ మొత్తాన్ని పొందేందుకు సోదరి అంబిక, సోదరుడు మల్లికార్జున్ కుంజన్ నాయర్ ప్రయత్నించారని రాధ ఫిర్యాదు చేశారు. కంపెనీ పేరు మారిన తర్వాత భద్రపరిచిన చెక్కులు మాయమయ్యాయని, తన ఆస్తిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని పేర్కొంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు.