రక్తదాన శిబిరంతో యువతకు ఆదర్శంగా నిలిచిన ఉత్సవ కమిటీ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పోలాకి
పోలాకి మండలంలోని మబగాం గ్రామంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేసిన యువతను, వాలంటీర్లను, వైద్య సిబ్బందిని శాలువాలతో సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు. పండుగలు అంటే భక్తితో పాటు సేవ కూడా అని, రక్తదానం ప్రాణదానంతో సమానమని వారు అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, యువత పాల్గొన్నారు.