స్కూల్ బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు
రిపోర్టర్: విజయ్
స్థలం: పల్నాడు
పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ అదహళ్లి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో స్కూల్ బస్సు డ్రైవర్లు మరియు కండక్టర్లకు రోడ్డు భద్రత, విద్యార్థుల సురక్షిత ప్రయాణంపై ప్రత్యేక అవగాహన సమావేశాలు నిర్వహించినట్లు పల్నాడు పోలీస్ వెల్లడించారు. ఈ సదస్సుల్లో డ్రైవర్లు పాటించాల్సిన ట్రాఫిక్ నిబంధనలు, వేగ పరిమితులు, ప్రయాణ సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా చర్చించారు. విద్యార్థుల ప్రాణ రక్షణే లక్ష్యంగా అధికారులు పలు కీలక సూచనలు చేశారు.