'అభిమానులకు రూ.5 లక్షల బీమా': పంచకర్ల రమేష్ బాబు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అనకాపల్లి
మెగాస్టార్ చిరంజీవి అభిమానుల కోసం రూ.5 లక్షల బీమా కల్పించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమని అనకాపల్లి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రశంసించారు. చిరంజీవి గారి సేవా స్ఫూర్తికి హ్యాట్సాఫ్ చెబుతూ, ఆయనకు అభిమానిగా ఉండటం తన అదృష్టమని పంచకర్ల రమేష్ బాబు కొనియాడారు. మెగాస్టార్ చేపట్టిన ఈ సంక్షేమ చర్యలను అందరూ అభినందించాలని ఆయన పేర్కొన్నారు.