నా ప్రయాణాన్ని అడ్డుకునేందుకు తెలుగుదేశం నేతలు కుట్ర: వైఎస్ జగన్ ఫైర్

రిపోర్టర్: వెంకట్ స్థలం: పులివెందుల

తన విమాన ప్రయాణ అనుమతిని రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కుట్ర పన్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పులివెందులలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా తమ ఏజెంట్లను బూతులలోకి అనుమతించకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న ఈ అక్రమాలపై ఎన్నికల అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేయడంతో పాటు, పోలింగ్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.