గోదావరి జలాలతో రిజర్వాయర్లు నింపాలని హరీష్ రావు డిమాండ్

రిపోర్టర్: రాము స్థలం: సిద్దిపేట

గోదావరిలో వరద నీరు ప్రవహిస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలోని రిజర్వాయర్లు అడుగంటిపోతున్నాయని బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల నిర్వహణపై రాజకీయాలు చేస్తూ రైతుల పంటలను ప్రభుత్వం కావాలనే ఎండగొడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి జలాలను తక్షణమే ఎత్తిపోతల ద్వారా తరలించి రిజర్వాయర్లను నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రస్తుత పాలకులు విఫలమయ్యారని ఆయన విమర్శించారు.