నాసిక్లో తీవ్ర కలకలం: భూగర్భ జలాల్లో ప్రమాదకర స్థాయిలో కాలుష్యం

రిపోర్టర్: రాజేష్ స్థలం: Nashik

మహారాష్ట్రలోని నాసిక్ అంబడ్ పారిశ్రామిక ప్రాంతంలో భూగర్భ జలాల్లో అత్యంత ప్రమాదకర హెక్జావాలెంట్ క్రోమియం భారీగా వెలుగుచూసిందని పరిశోధకులు వెల్లడించారు. తాగునీటి పరిమితి కంటే వెయ్యి రెట్లు అధికంగా ఈ విషపూరిత రసాయనం ఉన్నట్లు ప్రయోగశాల పరీక్షల్లో తేలిందని సౌత్ ఏషియా నెట్వర్క్ ఆన్ డామ్స్ రివర్స్ అండ్ పీపుల్ సంస్థ స్పష్టం చేసింది. సింహస్థ కుంభమేళాకు భక్తులు వస్తున్న తరుణంలో ఈ తీవ్ర కాలుష్యం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.