తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ

రిపోర్టర్: రాజేష్ స్థలం: Hyderabad

తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రాగల కొన్ని గంటల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ఐఎండీ అధికారులు స్పష్టం చేశారు.