విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఘనంగా పాల్గొన్న రాష్ట్రపతి

రిపోర్టర్: విజయ్ స్థలం: విజయవాడ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం ఘనంగా పాల్గొన్నారు. మహాచండీదేవి రూపంలో ఉన్న దుర్గమ్మను రాష్ట్రపతి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, వేద పండితులు ఆమెకు ఘన స్వాగతం పలికి వేదాశీస్సులు అందజేశారు. అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా రాష్ట్రపతి తన అనుభవాలను పంచుకున్నట్లు అధికారులు తెలిపారు.