నెల్లూరులో అధికారుల గైర్హాజరుపై జడ్పీ అత్యవసర సమావేశంలో తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: శివ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా పరిషత్ అత్యవసర సమావేశానికి కలెక్టర్, సీఈవో సహా అధికారులు హాజరుకాకపోవడంపై జడ్పీ ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌నినో ప్రభావం, నీటి ఎద్దడి నివారణ చర్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధికారులు రాకపోవడాన్ని ఖండిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు వైస్‌ ఛైర్మన్‌ ప్రసన్న మరియు 36 మంది సభ్యులు పాల్గొన్నారు.