తితిదే శిల్ప కళాశాల విద్యార్థి అద్భుత సృష్టి

రిపోర్టర్: హరి స్థలం: తిరుమల

అలిపిరి వద్దనున్న తితిదే శిల్ప కళాశాల విద్యార్థి సుబ్బరాయుడుగౌడ్‌ టేకు కొయ్యతో ఆరున్నర అడుగుల అనంతపద్మనాభస్వామి ప్రతిమను తయారు చేశారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శన స్టాల్‌లో ఈ నమూనాను ప్రదర్శించారు. ఇంత పొడవైన దేవతామూర్తుల ప్రతిమను ఏ విద్యార్థి ఇప్పటివరకు తయారు చేయలేదని ప్రిన్సిపల్‌ వెంకట్‌రెడ్డి తెలిపారు.