'నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం': విజయనగరం కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి

రిపోర్టర్: వెంకట్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 17, 18 తేదీల్లో కలెక్టరేట్ ఆడిటోరియంలో కౌశలం డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ డ్రైవ్‌లో 700 ఉద్యోగాల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 32 సంవత్సరాల వయస్సు గల పురుషులు, తగిన విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.