బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్ ఇంట్లో గణేష్ పూజ.
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Bangladesh
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు స్టార్ ఆటగాడు లిటన్ దాస్ ఇంట్లో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మత, దేశ సరిహద్దులను దాటి పండుగలు ప్రజలను కలుపుతాయనడానికి ఈ వేడుకలు నిదర్శనంగా నిలిచాయి.