ఇంగ్లాండ్‌ చేతిలో క్లీన్‌స్వీప్‌ పరాభవంపై బాబర్‌ ఆజం ఆవేదన

రిపోర్టర్: వెంకట్ స్థలం: World

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్‌ కావడంతో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్‌ ఆజం తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. జట్టు ప్రదర్శనపై నిజాయితీతో కూడిన సమీక్ష జరగాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. తప్పులను సరిదిద్దుకుని, మెరుగైన తుది జట్టును ఎంపిక చేసేందుకు యాజమాన్యం, సెలెక్టర్లతో కలిసి చర్చిస్తామని బాబర్‌ తెలిపారు.