తల్లులు చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: నగరి

తల్లులు, చిన్నారుల్లో పోషకాహారంపై అవగాహన పెంచడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించేందుకు పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీడీపీవో ఇందిరాప్రియదర్శిని తెలిపారు. శుక్రవారం సత్రవాడ, ఏకాంబరకుప్పం అంగన్వాడీ సెంటర్లలో నిర్వహించిన పోషణ్ పక్వాడా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మిషన్ పోషణ్ 2.0లో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ప్రజలను చైతన్యపరుస్తున్నారు. గర్భిణులు, బాలింతలు సమతుల్య ఆహారం తీసుకోవడం, శిశువులకు తల్లిపాలు అందించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.