రాష్ట్రంలో తొలి విడతగా రెండు వందల సివిల్ కోర్టుల ఏర్పాటు

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

రాష్ట్రంలో పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించి సత్వర న్యాయం అందించేందుకు తొలి విడతలో రెండు వందల కొత్త అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు న్యాయ వ్యవహారాల కార్యదర్శి బి. పాపిరెడ్డి జీవో ఎంఎస్ నెం.59 ని జారీ చేశారని అధికారులు తెలిపారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలో అత్యధికంగా డెబ్బై ఒకటి కోర్టులు రానుండగా, మిగిలిన జిల్లాల్లోనూ కోర్టులను మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు.