ఏపీలో పట్టణ స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికల షెడ్యూల్ విడుదల
రిపోర్టర్: సునీల్
స్థలం: విజయవాడ
ఆంధ్రప్రదేశ్ లోని మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ల పరోక్ష ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా బుధవారం విడుదల చేశారని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎనభై ఏడు మున్సిపాలిటీలు, పదమూడు కార్పొరేషన్లలో పరోక్ష ఎన్నికల నిర్వహణకు ఈ నెల పదద్దెనిమిది లోపు నోటీసు జారీ చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల ఇరవై మూడో తేదీన వైస్ చైర్ పర్సన్ లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.