శ్రీకాకుళంలో అల్యూమినియం స్మెల్టర్ ఏర్పాటుకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కృషి

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలోని ఉప్పు భూముల్లో భారీ అల్యూమినియం స్మెల్టర్ ఏర్పాటు కోసం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన ప్రతిపాదనకు కేంద్రం నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ఢిల్లీలో కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసి చర్చించిన రామ్మోహన్ నాయుడు, మూలపేట మరియు పూండి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న వేలాది ఎకరాల భూములు, మౌలిక వసతుల గురించి వివరించారు.