కూటమి సర్కార్కు గుడివాడ అమర్నాథ్ సవాల్: తోకముడిచి పారిపోయే రకం కాదంటూ మండిపాటు
రిపోర్టర్: మహేష్
స్థలం: అనకాపల్లి
చంద్రబాబులా తోకముడిచి పారిపోయే నాయకత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో లేదని విశాఖపట్నం ప్రాంతానికి చెందిన గుడివాడ అమర్నాథ్ ఘాటుగా స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ గుడివాడ అమర్నాథ్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.