చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం

రిపోర్టర్: విజయ్ స్థలం: సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లా మనూరు గ్రామంలో దుస్తులు ఉతకడానికి వెళ్లి చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. నవరాత్రుల పూజల ఏర్పాట్లలో భాగంగా చెరువు వద్దకు వెళ్లిన నర్సింహా రెడ్డి, కృష్ణవేణి, సంగారెడ్డి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. ఒకరిని రక్షించేందుకు మరొకరు ప్రయత్నించడంతో ఈ ఘోర విషాదం చోటుచేసుకుందని, చెట్టు కొమ్మను పట్టుకుని చిన్న కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడని అధికారులు పేర్కొన్నారు.