రష్యా సైనికులను బంధిస్తూ ఉక్రెయిన్ చేపట్టిన ఆపరేషన్ వివాల్డీ

రిపోర్టర్: కిరణ్ స్థలం: కీవ్

రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ సరికొత్త అస్త్రంగా ఆపరేషన్ వివాల్డీని చేపట్టిందని థర్డ్ ఆర్మీ కోర్ బ్రిగేడియెర్ జనరల్ ఆండ్రీ బిలెట్స్కీ వెల్లడించారు. సోవియట్ కాలం నాటి పాత వాహనాలను ఆత్మాహుతి బాంబర్లుగా మార్చి రష్యా స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల ద్వారా ఉక్రెయిన్ దళాలు 250 మంది మాస్కో సైనికులను బంధించడంతో పాటు కీలక భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయని ఆయన స్పష్టం చేశారు.