కోల్ ఇండియా పనితీరుపై కోల్కతాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

కోల్ ఇండియా లిమిటెడ్ మరియు దాని అనుబంధ సంస్థల పనితీరుపై కోల్కతాలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బొగ్గు ఉత్పత్తి, రవాణా మరియు నిర్దేశిత లక్ష్యాల పురోగతిని ఆయన నిశితంగా పరిశీలించారు. సంస్థలో కార్యాచరణ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడంపై స్పష్టమైన ప్రాధాన్యతలను నిర్దేశించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. భవిష్యత్ లక్ష్యాలను వేగవంతం చేయాలని ఈ సమావేశంలో ఆయన అధికారులను ఆదేశించారు.