హెచ్చరిక: హోటళ్లలో కల్తీ మాంసం గుట్టురట్టు, అప్రమత్తంగా ఉండాలన్న నిపుణులు

రిపోర్టర్: శివ స్థలం: నెల్లూరు

ఆదివారం వచ్చిందంటే చాలు బయట బిర్యానీలు, మాంసాహారాలు తినే అలవాటున్న ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నెల్లూరులోని బోసుబొమ్మ సెంటర్తో పాటు పలు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో ఫుడ్సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నిల్వ ఉంచిన మాంసం, రంగులేసిన వస్తువులు విక్రయిస్తున్నట్లు వెలుగుచూసింది. కల్తీరాయుళ్లపై అధికారులు కేవలం జరిమానాలతో సరిపెడుతుండటంతో వారిలో మార్పు రావడం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.