వరంగల్ జిల్లాలో స్వేచ్ఛా రథం ప్రచారం ప్రారంభం: వెట్టి చాకిరిపై అవగాహన

రిపోర్టర్: సురేష్ స్థలం: వరంగల్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టరేట్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజుతో కలిసి స్వేచ్ఛా రథం ప్రచార వాహనాన్ని ప్రారంభించినట్లు కలెక్టర్ వరంగల్ అధికారిక ఖాతా వెల్లడించింది. మీ పని మీ జీవితం మీ స్వేచ్ఛ గోడపత్రికను ఆవిష్కరించి వెట్టి చాకిరిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రథానికి జెండా ఊపినట్లు తెలిపారు. ప్రజావాణిలో అర్జీలు స్వీకరించి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించామని కలెక్టర్ పేర్కొన్నారు.