అసంఘటిత కార్మికులకు గుడ్ న్యూస్: పీఎం శ్రమ్ యోగి పెన్షన్ పథకం
రిపోర్టర్: హరి
స్థలం: Andhra Pradesh / Telangana
అసంఘటిత రంగంలోని కార్మికులకు భవిష్యత్తులో ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్ యోజన అమలులో ఉందని Ministry of Labour & Employment, GoI వెల్లడించారు. ఈ ప్రత్యేక పెన్షన్ పథకం ద్వారా అరవయ్యేళ్లు నిండిన ప్రతి కార్మికుడికి ప్రతి నెలా మూడు వేల రూపాయల చొప్పున కనీస పింఛన్ లభిస్తుందని పేర్కొన్నారు. అర్హులైన వారు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.