రీపోలింగ్ పై ఎస్ఈసీ కీలక ప్రకటన: తగిన ఆధారాలుంటేనే సిఫార్సు చేస్తామని స్పష్టీకరణ

రిపోర్టర్: సతీష్ స్థలం: Amaravati

పల్నాడు, అనంతపురం జిల్లాల్ లో రీపోలింగ్ అంశంపై తగిన ఆధారాలు, కారణాలు ఉంటేనే సిఫార్సు చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కలెక్టర్లు మరియు ఎస్పీల నివేదికల ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని ఎస్ఈసీ తెలిపారు. మరోవైపు పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేస్తూ ఎన్నికల అధికారులపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు.