గణేష్ నిమజ్జనం వేళ హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగేందుకు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 10 గంటల వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. బాలాపూర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు ప్రధాన ఊరేగింపు సాగనున్న నేపథ్యంలో, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.