ఈసాప్స్ పన్ను విధానంపై షాదీ డాట్ కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ నిలదీత
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
ఉద్యోగులు కంపెనీలలో వాటాలు కొనుగోలు చేసే ఈసాప్స్ విధానంపై ఉన్న పన్ను నిబంధనలను శరద్ ట్యాంక్ జడ్జి, షాదీ డాట్ కామ్ వ్యవస్థాపకులు అనుపమ్ మిట్టల్ తీవ్రంగా ప్రశ్నించారు. ఉద్యోగులను యజమానులుగా భావించాలని కోరుతూనే, వారు వాటాలు కొనుగోలు చేసినప్పుడు అధిక పన్నులు విధించడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్టార్టప్ రంగాన్ని ప్రోత్సహించడానికి పన్ను విధానంలో మార్పులు రావాలని ఆయన స్పష్టం చేశారు.