బతుకమ్మ ఘాట్ ఏర్పాట్లు పరిశీలించిన చైర్పర్సన్ దావ స్వాతి

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి పట్టణంలోని ఏడవ వార్డు బతుకమ్మ ఘాట్ను మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి రమేష్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఉత్సవాల నేపథ్యంలో చేపడుతున్న పారిశుధ్య పనులు, ఇతర ఏర్పాట్లను పరిశీలించి మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.