רכاريلੋ అక్రమంగా మద్యం తరలిస్తున్న మహిళ అరెస్ట్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: బీహార్

బీహార్‌లోని సమస్తిపూర్‌లో రైలులో అక్రమంగా మద్యం తరలిస్తున్న 22 ఏళ్ల యువతిని, ఆమె బంధువును పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్‌లో ప్రయాణిస్తూ లగేజీలో దాదాపు 75 లీటర్ల ఖరీదైన మద్యం బాటిళ్లను తరలిస్తుండగా జీఆర్పీ పోలీసులు పట్టుకున్నారు. పెళ్లి వేడుక కోసం మద్యం తీసుకెళ్తున్నట్లు నిందితులు తెలిపారు. బీహార్‌లో మద్యం నిషేధం ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.