సెంట్రల్ రైల్వే పరిధిలో టికెట్ రహిత ప్రయాణికులపై ఉక్కుపాదం
రిపోర్టర్: నరేష్
స్థలం: ముంబై
మధ్య రైల్వే పరిధిలో ఏప్రిల్ నుండి ఆగస్టు మధ్య చేపట్టిన విస్తృత తనిఖీల్లో అనధికారిక ప్రయాణికుల నుంచి రూ.140.8 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. ముంబై డివిజన్ అత్యధికంగా రూ.58.5 కోట్లు వసూలు చేయగా, భుసావల్, పూణే, నాగపూర్ డివిజన్లు కూడా తనిఖీలను ముమ్మరం చేశాయి. పెరిగిన జరిమానాలు, నిరంతర ఆకస్మిక తనిఖీల కారణంగా టికెట్ లేని ప్రయాణాలకు అడ్డుకట్ట పడుతోందని సీనియర్ అధికార ప్రతినిధి స్వప్నిల్ నీలా స్పష్టం చేశారు.