'సీతాకోకచిలుక దశలోకి మారాలి..': ఆస్మాన్ టీజర్ రిలీజ్

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

దివంగత నటుడు శ్రీహరి వారసుడు మేఘాంశ్ హీరోగా రామ్ నందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ హర్రర్ చిత్రం 'ఆస్మాన్'. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చర్చి బ్యాక్‌డ్రాప్, సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో సాగే ఈ చిత్రంలో మేఘాంశ్ రగ్గడ్ లుక్‌లో కనిపించారు. శ్రీ క్లింకార సెల్యులాయిడ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు పలు భాషల్లో పాన్-ఇండియా రేంజ్‌లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.