అచ్చంపేటలో గద్దర్ విగ్రహావిష్కరణ కోసం కదంతొక్కిన కళాకారులు
రిపోర్టర్: dumarla bhaskar senier journalist
స్థలం: అచ్చంపేట
ప్రజా యుద్ధనౌక గద్దర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అచ్చంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం పక్కన ఈనెల ఇరవై రెండో తేదీన నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కరపత్రాలను నియోజకవర్గ ఇన్చార్జి కృపానందం చేతులమీదుగా ఆదివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జక్కగోపాల్ చెవ్వ పాండు నేతృత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కవులు కళాకారులు గద్దర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.