రామమందిరం సీఈఓ నియామకంపై వస్తున్న ఆరోపణలను ఖండించిన ట్రస్ట్

రిపోర్టర్: నరేష్ స్థలం: అయోధ్య

అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయ సీఈఓగా జితేంద్ర మిశ్రా నియామకంపై చెలరేగిన వివాదంపై ట్రస్ట్ స్పందించింది. ఆయన ఇంటర్వ్యూకు హాజరు కాలేదన్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. నిబంధనల ప్రకారమే పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జరిగిందని స్పష్టం చేసింది. వేలాది దరఖాస్తులను పరిశీలించి, నిపుణుల కమిటీ సమక్షంలోనే ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేసినట్లు ట్రస్ట్ వెల్లడించింది.