అనంతపురం ఉదంతం: నిందితుడు హేమంత్ కాళ్లు తొలగించే అవకాశం ఉందన్న వైద్యులు
రిపోర్టర్: మహేష్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడు హైస్కూల్ లో విద్యార్థినిపై దాడి చేసిన నిందితుడు హేమంత్ ఎన్కౌంటర్ ఘటనలో అతని కాళ్లు తొలగించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. పోలీసుల కాల్పుల్ లో గాయపడిన హేమంత్ కు జీజీహెచ్ లో సర్జరీ నిర్వహించారు. మోకాలి చిప్పలు ఛిద్రం కావడంతో కుడికాలు లేదా రెండు కాళ్లు తొలగించే ప్రమాదం ఉందని వైద్యులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, బాలిక బెంగళూరులో చికిత్స పొందుతున్నది.