టీజీపీఎస్సీ సంచలన నిర్ణయం.. డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు, లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి సంబంధించి 2022లో విడుదల చేసిన 544 పోస్టుల నోటిఫికేషన్ను పూర్తిగా రద్దు చేసింది. ప్రస్తుత ప్రభుత్వ నియమ నిబంధనలు, రోస్టర్ విధానం, రిజర్వుడ్ కేటగిరీల మార్పులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. త్వరలోనే నూతన విధివిధానాలతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది.