కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
రిపోర్టర్: సతీష్
స్థలం: కరీంనగర్
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో భాగంగా నూతన కలెక్టరేట్ భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అలాగే సిరిసిల్ల మరియు వేములవాడ ప్రాంతాలలో సుమారు మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి తొంభై తొమ్మిది కోట్లతో చేపట్టే పనులకు కూడా ముఖ్యమంత్రి భూమిపూజ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.